ఐక్య ఉద్యమానికి సిద్ధం  కావాలి  
 

* యుటిఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శాంతికుమారి

(ఉద్యోగులు న్యూస్)

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి సంఘాలన్నీ కలిసికట్టుగా ఉద్యమించేందుకు సిద్ధం కావాలని మంచిర్యాల టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శాంతి కుమారి పిలుపునిచ్చారు. మంచిర్యాల యుటిఎఫ్ కార్యాలయంలో మంగళవారం జరిగిన మండల కార్యవర్గ సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రం వచ్చి ఆరేళ్ళు దాటినా పిఆర్సి అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. వెంటనే ఇవ్వాలనిలని డిమాండ్ చేశారు. అనేక మంది ఉపాధ్యాయులు పదవీ విరమణకు నోచడంలేదన్నారు. పదోన్నతులతో సహా బదిలీలు చేపట్టాలని కోరారు. అంతర్జిల్లా బదిలీలు జరపాలన్నారు. . కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న కేజీబీవీ ,,ఆశ్రమ పాఠశాల ,మోడల్ స్కూలు మరియు గురుకులాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. , హెల్త్ కార్డులను మంజూరు చేయాలి ,,మోడల్ స్కూల్ లో పనిచేస్తున్న అవర్లీ బేస్డ్ ఉపాధ్యాయులకు వెంటనే వేతనాలు మంజూరు చేయాలని కోరారు. . కోవిడ్ ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో మాదిరి గురుకులాల్లోనూ ప్రతిరోజు 50 శాతం ఉపాధ్యాయులతో విధులు నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు వేణు, ఉపాధ్యక్షులు గొల్ల రామన్న, లావణ్య, కోశాధికారి దిలీప్ రాథోడ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగాచారి తదితరులు పాల్గొన్నారు..