Tuesday 1st December 2020
ముఖ్యాంశాలు
  ఉపాధ్యాయుల బదిలీలవెబ్ కౌన్సెలింగుపై డెమో వాయిదా  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలి  ***  శాంతిఖని గనిలో టీజీబీకేఎస్ ద్వార సమావేశం  ***  మ్యాన్యువల్ కౌన్సిలింగే అవసరం  ***  సీపీఎస్ రద్దు కు మండలిలో ఎం ఎల్ సి రామకృష్ణ డిమాండ్  ***

ఆన్ లైన్ తరగతుల ఆధారంగా  గ్రేడింగ్ విధానాన్ని తొలగించాలి

*తెలంగాణ రాష్ర్ట టీచర్సు యూనియన్ డిమాండ్

(ఉద్యోగులు న్యూస్)


తెలంగాణలో ఆన్ లైన్ తరగతుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వడం సాధ్యం కాదని తెలంగాణ  రాష్ర్ట టీచర్స్ అసోసియేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆ సంఘం నాయకులు  మహమ్మద్ అబ్దుల్లా ,  చందూరి రాజిరెడ్డి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కోవిడ్ నేపథ్యంలో రాష్ర్టంలో ఆన్ లైన్ విధానంలోనే చదువులు చెప్పామని, టీశాట్,  డీడీ యాదగిరి ఛానళ్ల ద్వారా 3 నుంచి 10 తరగతుల వరకు పాఠాలు ప్రసారం చేస్తూ  కృత్య పత్రాలు పూర్తి చేసి వాట్సాప్ గ్రూపుల్లో పంపిన వాటిని ప్రతి వారం ఉపాధ్యాయులు పరిశీలించి గ్రేడ్ లు  నమోదు చేయాలనడం సరికాదన్నారు. ఈ విధానం అశాస్ర్తీయమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో  చదివే పేద, బడుగు బలహీస వర్గాల విద్యార్థులకు  వేలాది రూపాయలు వెచ్చించి స్మార్టు ఫోన్లు కొనుగోలు చేసే శక్తి లేదని సంఘం నాయకులు పేర్కొన్నారు. వారి తల్లిదండ్రుల  ఫోన్లే వినియోగించుకోవడం, అవి సరిగా అందుబాటులో లేక పోవడం వల్ల  కృత్య పత్రాలు  సరిగా పూర్తి చేసి పంపే విద్యార్థుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని ఆ  ప్రకటనలో వివరించారు. కోవిడ్ వల్ల ఉపాధ్యాయులు కూడా కృత్య పత్రాలు విద్యార్థులకు అందించలేకపోయారని  అబ్దుల్లా, రాజిరెడ్డిలు పేర్కొన్నారు. . కృత్య పత్రాల ఆధారంగా గ్రేడింగు విధానాన్ని పూర్తిగా తొలగించాలని వారు  డిమాండ్ చేశారు.