Thursday 29th October 2020
ముఖ్యాంశాలు
  • నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు....రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
  • మాటిచ్చారు సరే ...రాసిద్దురూ!....సేవలు, సవాళ్ళలో నిత్యం పోరాటయోధులమే....విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ పట్టు
  • సంరక్షణ పథకం కింద చికిత్స చేయాల్సిందే....డబ్బులు వసూలు చేస్తే 10 పెనాల్టీ.....డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో
  • ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ సంస్థలు.....రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
  • ముఖ్యమంత్రి చెంతకు ఉపాధ్యాయుల సమస్యలు.........సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా..
  • కలిసి కదులుదాం.. వృత్తిలో ఎదుగుదాం...........ఏపి డైరెక్ట్ రిక్రూట్మెంట్ విఆర్వో స్ అసోసియేషన్
  • ఉపాధ్యాయుల సమ్మతితో విలీనం జరగాలి...ఏపీటీఎఫ్ 1938
  • ప్రత్యేక స్కూల్ అసిస్టెంట్లకు జీతాలు మంజూరు

డీఎలెస్సీ నిర్వహించి పోస్టింగులు ఇవ్వండి

టి‌ఎస్‌టి‌టి‌ఎఫ్

 

ఏటూర్ నాగారం ఐటీడీఏ వివిధ శాఖలలో ఎంపికైన గిరిజన అభ్యర్థులకు డీఎలెస్సీ నిర్వహించాలని ప్రాజెక్ట్ అధికారి హనుమంత్ జెండాల్ ను టి‌ఎస్‌టి‌టి‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ కోరారు. అయన నేతృత్వంలో తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్, క్రిష్ణ ప్రసాద్ టిడబ్ల్యూటియూ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, బోడ గన్నా, టీఎస్టీటీఎఫ్ రాష్ట్ర నాయకులు, ధరావత్ సురేష్ నాయక్, సేవాలాల్ విద్యార్థి సేన భద్రాద్రి జిల్లా అధ్యక్షులు, అభ్యర్థులు గుమ్మడి నర్సింగరావు, జాటోత్ సురేష్,మేకల నరేష్, చింత సందీప్, బిందు, తదితరులు, మరియు సంఘ ప్రతినిధులు పీవోను కలిశారు . తమ సమస్యల పరిష్కారానికి వినతి పత్రాన్ని అందించారు. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలో వివిధ శాఖలలో ఉన్న ఖాళీల భర్తీకి ఎంపిక చేసిన గిరిజన అభ్యర్థులు అనేక సార్లు రాత పూర్వకంగా విజ్ఞప్తి చేశారన్నారు . పీవోకు నివేదించిన సమస్యలను టీయస్టీటీఎఫ్ ప్రకటనలో పేర్కింది. పీవో సానుకూలంగా స్పందించారని తెలిపారు

* ఏజెన్సీ ప్రాంతంలో టీఆర్టీ ఉపాధ్యాయ, ఫారెస్ట్, పంచాయితీ కార్యదర్శి , కస్తూరిభా గాంధీ పీజీసీఆర్టీ , పశుసంవర్ధక శాఖ తదితర ఉద్యోగాలకు ఎంఐపికైన గిరిజన అభ్యర్థులకు డీఎలెస్సీ వెంటనే నిర్వహించి పోస్టింగులు ఇవ్వాలి.

* ప్రస్తుతం అమలులో వున్న జిఓ నెం 24 ప్రకారం డీఎలెస్సీ నిర్వహించాలి.

* జిఓ నెం 3 కు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా చట్టబద్రత కల్పించాలి.

* భద్రాచలం ఐటీడీఏ ఉన్నతాధికారులు డీఎలెస్సీ పక్రియ పూర్తి చేసి అభ్యర్థుల జాబితాను ఆయా శాఖలకు పంపించారని, అదే విధంగా

ఏటూర్ నాగారం ఐటీడీఏ పరిధిలో జరగాలి .