Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

ఉపాధ్యాయ బదిలీల కోసం తెలంగాణ జాక్టో డిమాండ్

*ఇతర డిమాండ్లు నెరవేర్చాలి

 

అన్ని మేనేజి మెంట్ల వారీగా ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వాలని, బదిలీలు చేపట్టాలని తెలంగాణ జాక్టో సమావేశం డిమాండ్ చేసింది. జూమ్ యాప్ ద్వారా గురువారం జాక్టో సభ్య సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. అంతర్ జిల్లా బదిలీలు చేపట్టాలని కోరింది. పండిత  పోస్టులను అప్ గ్రేడ్ చేయాలని, దసరా నాటికి మూడు డీఏలు ఇవ్వాలని కూడా ఈ సమావేశం ప్రభుత్వాన్ని కోరింది. పీ ఆర్ సీ నివేదిక తీసుకుని 62శాతం ఫిట్ మెంటుతో అమలు చేయాలని సమావేశం కోరింది. ఈ డిమాండ్లు నెరవేరని పక్షంలో యు ఎస్ పి సి తో సహా కలిసి ఉద్యమాన్ని చేపట్టాలని తీర్మానించారు.  ఈ మీటింగ్ లో జాక్టో చైర్మన్ సదానందం గౌడ్ , కృష్ణుడు,రాధాకృష్ణ, లక్ష్మణ్ నాయక్ చక్రవర్తుల శ్రీనివాస్, మోహన్ రెడ్డి, లక్ష్మణ్ గౌడ్, పర్వతరెడ్డి ,గౌరీ శంకర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.