కీసర కలెక్టరేట్ ముందు 'తపస్' ధర్నా

(ఉద్యోగులు న్యూస్)


ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోరుతూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) మేడ్చల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా జరిగింది. ఉపాధ్యాయ సంఘాలు నిర్వహించిన ధర్నాకు బిజెపి,  ఏబీవీపీ మద్దతు తెలిపాయి. తపస్ జిల్లా అధ్యక్షుడు గడప నవీన్,  రాష్ట్ర కార్యదర్శి కే. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఉపాధ్యాయుల సమస్య ఏ ఒక్కటి పరిష్కారం కాలేదన్నారు.  తక్షణమే ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని ధర్నాకు మద్దతుగా నిలిచిన బిజెపి రూరల్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి డిమాండ్ చేశారు. తపస్ నాయకులు గోపాల్ , హనిమిరెడ్డి,  ప్రవీణ్ , రాజ్ కుమార్,  రమేష్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు