టిపియుఎస్ ధర్నా

(ఉద్యోగులు న్యూస్)


 ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోరుతూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(టీపియూఎస్) లక్కడీకాపూల్ కలెక్టరేట్  ముందు ధర్నా చేసింది. జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బి జనార్ధన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ ధర్నాకు ఎమ్మెల్సీ రామచంద్రరావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేయాలని,ఉపాధ్యాయులకు బదిలీలు పదోన్నతులు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు.కార్యక్రమంలో ఏపీయూఎస్ నేతలు వనం పద్మ,బొడ్డు రవి,వెంకటేశం,కాశి రావుశ్రీధర్ శ్రీకాంత్ చంద్రశేఖర్ రెడ్డి భూపాల్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు