కేజీబీవీ సమస్యలపై మూడు దశల పోరాటం
* టీఎస్ యుటిఎఫ్
(ఉద్యోగులు న్యూస్)
కేజీబీవీ పాఠశాలల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల పోరాటానికి పిలుపునిచ్చింది.జనవరి 20, 21వ తేదీల్లో పాఠశాల స్థాయిలో నిరసన కార్యక్రమాలు, జనవరి 29న జిల్లా కేంద్రంలో సామూహిక నిరాహార దీక్షలు, ఫిబ్రవరి 12న డీఎస్ఈ ముట్టడిస్తామని తెలిపింది . కాసిపేట మండలం కేజీబీవీ పాఠశాలలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా కోశాధికారి రాథోడ్ దిలీప్ మాట్లాడుతూ మూడుదశల పోరాట వివరాలు తెలిపారు. కేజీబీవీ లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కేర్ టేకర్ లను నియమించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న సెలవులన్నింటిని కేజీబీవీ ఉపాధ్యాయులకు వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేజీబీవీ సమస్యల పరిష్కారంలో భాగంగా . కావున అందరూ ఈ ఉద్యమంలో పాల్గొని సమస్యల తీవ్రత ను ప్రభుత్వానికి తెలియజేసేలా కదలాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ఎస్ఓ సరిత, కేజీబీవీ సిబ్బంది పాల్గొన్నారు.