Monday 18th January 2021
ముఖ్యాంశాలు
  పారామెడికల్ ఉద్యోగుల క్రమబద్దీకరణ పైత్వరలోనే సానుకూల నిర్ణయం  ***  పీఆర్సీ ఇవ్వకుంటే ఫిబ్రవరిలో ప్రత్యక్ష కార్యాచరణే  ***  తెలంగాణ ముద్ర కనబడే లామొదటి పి.ఆర్.సి ఇవ్వండి  ***  రైతు ఉద్యమానికి టిఎస్ యుటిఎఫ్ సంఘీభావం  ***  ప్రకాశం జిల్లా ఏపీజిఈఎఫ్ చైర్మన్ గా రాజారావు  ***  కాంట్రాక్టు పారా మెడికల్ ఉద్యోగులను క్రమబద్దీకరించండి  ***  త్వరలో వీఆర్వోల ఆత్మగౌరవ సభ  ***  పంచాయతీ కార్యదర్శుల స్పెషల్ ఫోరమ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా మహేష్  ***

పాఠశాలల్లో విద్యావలంటీర్లని, స్వచ్ఛ కార్మికులను నియమించాలి.

*   రాజన్న సిరిసిల్ల జిల్లా టీపీటీఎఫ్  అధ్యక్షుడు దోర్నాల భూపాల్ రెడ్డి

ఉద్యోగులు న్యూస్
 

ప్రభుత్వం ఫిబ్రవరి 1  నుండి 9 ఆపై తరగతుల నిర్వహణకు ఆదేశాలు ఇచ్చినందున  పాఠశాలలో  అవసరమైన చోట విద్యా వలంటీర్లని  నియమించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా టీపీటీఎఫ్  అధ్యక్షుడు దోర్నాల భూపాల్ రెడ్డి  కోరారు. అదేవిధంగా అన్ని పాఠశాలల్లో స్వచ్ఛ కార్మికులని నియమించాలన్నారు.  శివనగర్ ఉన్నత పాఠశాల,సిరిసిల్లలో జరిగిన  విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఫిబ్రవరి 1 వ తేదీనుంది పాఠశాలలు విద్యార్థుల హాజరుతో ప్రారంభం కానునున్నాయని,ఇప్పటి వరకు పాఠశాలలకు ప్రతిరోజూ 50% ఉపాధ్యాయులు హాజరౌతున్నా గదులు ఊడ్చేవారు, మరుగు దొడ్లు నిర్వహణ  లేక ఉపాధ్యాయులే శుభ్రం చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.  

ఫిబ్రవరి నుండి  తప్పని సరిగా  స్వచ్ఛ కార్మికుల అవసరం ఉన్నందున  వారి సేవలని  రీ ఎంగేజ్ చేయాలని అదే విధంగా  అవసరం ఉన్నచోట విద్యావలంటేర్ లని కూడా నియమించాలని డిమాండ్ చేసారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సత్వరమే అమలు జరిగేలా చూడాలని కోరారు. అంతరజిల్లా బదిలీల షెడ్యూల్ సత్వరమే ప్రకటించాలని డిమాండ్ చేశారు.. ఈ సందర్భంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గుజ్జినేని వేణుగోపాల్ రావు, ఉపాధ్యక్షులు మల్లారపు పురుషోత్తం, తాళ్లపల్లి శ్రీధర్,ద్యావనపెళ్లి పరమేష్,పెండ్యాల సుభాష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 

ఎక్కువ మందిచదివినవి