పాఠశాలలు చక్కదిద్ది అప్పుడు తెరవండి


* టీపీటీఎఫ్  నేతల డిమాండ్
   

ఉద్యోగులు  న్యూస్


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 9,10 తరగతుల ప్రత్యక్ష బోధనకు అనుమతిస్తూ   ఫిబ్రవరి 1 నుండి పాఠశాలలు ప్రారంభించడానికి నిర్ణయించినందువల్ల తక్షణమే పాఠశాలలో  పరిస్థితులను చక్క దిద్దాలని తెలంగాణ ప్రోగ్రెస్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.  ఈ మేరకు  ఆ సంఘం నేతలు కె. రమణ,   మైస శ్రీనివాసులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.  సర్వీస్ పర్సన్స్ ను నియమించాలని అదేవిధంగా పాఠశాలలో శానిటైజ్  చేయడానికి స్థానిక ఆరోగ్య కేంద్రం, గ్రామపంచాయతీలు బాధ్యత వహించేవిదంగా సూచనలు విడుదలచేయాలనీ, తల్లితండ్రులకు కూడా ప్రభుత్వం అవగాహనా కల్పించాలని కోరింది. , పాఠశాలలో శానిటైజ్  చేయడానికి అన్ని సౌకర్యాలు కల్పించాలని, ఇందుకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేయాలని కోరింది.  9,10 తరగతులకు ప్రత్యక్ష బోధన నిర్వహిస్తూ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మూడు మాసాలు పదో తరగతికి బోధించి మే నెలలో 6 సబ్జెక్టుల్లో వార్షిక పరీక్షలు  నిర్వహించాలని గతంలో మాదిరిగానే ఇంటర్నల్ మార్క్స్ నమోదు చేయాలని డిమాండ్ చేసింది.  ముఖ్యమంత్రి జరిపిన సమీక్ష సమావేశంలో విద్యాశాఖకు సంబంధించి ఉపాధ్యాయుల సాధారణ, అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా బదిలీలు విషయం చర్చకు రాకపోవడం కుటుంబాలకు దూరంగా పనిచేస్తున్న  ఉపాధ్యాయులను నిరాశపరిచిందన్నారు. అన్ని యజమాన్యాలలోని  ఉపాధ్యాయులకు బదిలీలు  నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము.  బదిలీలు లేకుండా పదోన్నతులు నిర్వహిస్తే ఉపాధ్యాయులకు నష్టం వాటిల్లుతుంది. అదే విధంగా తెలంగాణలో పనిచేస్తున్న ఆంద్రప్రదేశ్ స్థానికత కలిగిన సుమారు 352 మంది ఉపాధ్యాయులు 17 మంది స్పాఉస్  ఉపాధ్యాయులకు కూడా బదిలీల అవకాశం కల్పించాలని  కోరారు.  అన్ని క్యాడర్ పోస్టులకు పదోన్నతులు కల్పించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాలలో  ఖాళీలను భర్తీ చేయాలని కోరింది.  ఉప విద్యాశాకాధికారుల, డైట్ అధ్యాపకులు, యంఈఓ పోస్టులనుకూడా భర్తీ చేయాలనీ డిమాండ్ చేసింది. గత ఎనిమిది ఏళ్లుగా  పదోన్నతులు నిర్వహించక పోవడం వలన ప్రతి క్యాడర్ లో అనేక పోస్టులు ఖాళీలు ఏర్పడి విద్యాశాఖలో పర్యవేక్షణ కొరవడింది. విషయానిపుణులు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున అన్ని క్యాడర్ పోస్టులకు పదోన్నతులు నిర్వహించా లని  .తెలంగాణ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు  కె. రమణ, ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు ఒక ప్రకటనలో ప్రభుత్వానికి నివేదించారు.