Tuesday 1st December 2020
ముఖ్యాంశాలు
  ఉపాధ్యాయుల బదిలీలవెబ్ కౌన్సెలింగుపై డెమో వాయిదా  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలి  ***  శాంతిఖని గనిలో టీజీబీకేఎస్ ద్వార సమావేశం  ***  మ్యాన్యువల్ కౌన్సిలింగే అవసరం  ***  సీపీఎస్ రద్దు కు మండలిలో ఎం ఎల్ సి రామకృష్ణ డిమాండ్  ***

23న  ధర్నాకు టీచర్ల నోటీసు

(ఉద్యోగులు న్యూస్)


పీఆర్సీ  ప్రకటించాలని. రెండు విడుతల డీఏ  ప్రకటించాలని డిమాండ్  చేస్తూ నవంబరు 23న సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేయనున్నట్లు తెలంగాణ  ప్రోగ్రెసివ్  టీచర్స్ ఫెడరేషన్  సిద్దిపేట  జిల్లా శాఖ ఒక ప్రకటలో  తెలిపింది.  ప్రభుత్వం  విద్యారంగ , ఉపాధ్యాయుల  సమస్యల పై నిర్లక్ష్య  వైఖరికి  నిరసనగా, సిద్దిపేట  జిల్లాలో  మెడికల్ బోర్డు లో  ఉపాధ్యాయుల మెడికల్  బిల్లుల్లో  జాప్యానికి, విపరీతమైన  కోతకు నిరసనగా  ఈ ఆందోళన చేపడుతున్నట్లు, ఇందుకు నోటీసు ఇచ్చినట్లు సంఘం నాయకులు  జి. తిరుపతి రెడ్డి,  ఎస్. కనకయ్య,  పొన్నమల్ల రాములు, కె. రామస్వామి  తెలిపారు.