Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా బోనస్....ఉద్యోగులకు పండగ శుభవార్త చెప్పిన కేంద్రం.
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

టీఎస్పీఎస్ నోటిఫికేషన్లు ఎపుడు?

 

టీఎన్జీవో యూనియన్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎస్.ఎం.హుస్సేని (ముజీబ్)  ఆధ్వర్యంలో వివిధ యూనిట్ల అధ్యక్ష, కార్యదర్శులతో గృహకల్ప ఆఫీస్ లో గురువారం అత్యవసర సమావేశం జరిగింది. పలు అంశాలు చర్చకు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక  ఈనాటి వరకు  టీఎస్పీఎస్ గ్రూప్-1, గ్రూప్-3 ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని ముజీబ్ అన్నారు. ఈ విషయమై నిరుద్యోగుల అభ్యర్థనను ప్రభుత్వం ముందు ఉంచుతామన్నారు.

 

*ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన

 

 హైదరాబాద్, రంగారెడ్డి ,మహబూబునగర్ జిల్లా నియోజక పట్టభద్రుల  ఎం.యల్.సి ఎన్నికల్లో ఓటరు నమోదు అవగాహనా సదస్సులు నిర్వహిస్తామని హుస్సేని తెలిపారు. ఈ నెల 09, 12, 14,  16  తేదీల్లో సదస్సులు జరుగుతాయన్నారు. టీఎన్జీవో యూనియన్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కే.దేవేందర్, కోశాధికారి జె.బాలరాజ్, ఉపాధ్యక్షుడు  యస్.విక్రమ్ కుమార్, కె.ఆర్.రాజ్ కుమార్, ఉమర్ ఖాన్, కుర్రాడి శ్రీనివాస్, ఈ.నరేష్ కుమార్, ఎస్.మరళిరాజ్, హరిబాబు, ఖాలీద్ అహ్మద్, యం.ఏ.ముజీబ్, జి.గీత, టి.వెంకటేష్, మాజీ కార్యదర్శి జి.ప్రభాకర్ మరియు బి.జానకి పాల్గొన్నారు.

ఎక్కువ మందిచదివినవి