Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా బోనస్....ఉద్యోగులకు పండగ శుభవార్త చెప్పిన కేంద్రం.
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

పాలకులూ గురువుల గోడు వినండి

* టీఎస్ యూటీఎఫ్ సభ్యత్వ నమోదు లో జిల్లా అధ్యక్షురాలు

 

జిల్లాలో టీఎస్ యుటిఎఫ్ సంఘ సభ్యత్వం నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజ కొమరంభీం జిల్లా రెబ్బన మండలంలోని కేజీబీవీ గంగాపూర్ పాఠశాలల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు శాంతి కుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము కోవిడ్ సందర్భంగా మూడు నెలలు ఉద్యోగులకు 50శాతం వేతనాల్లో కోత విధించడంలో తీసుకున్న నిర్ణయం ఒకేసారి నగదు చెల్లించకుండా నాలుగు విడతలుగా చెల్లించడం అనేది సమంజసం కాదన్నారు. . జిల్లాలో కోవిడ్ బారిన పడిన ఉపాధ్యాయులకు, కేజీబీవీ, ఆశ్రమ, ప్రభుత్వ అన్ని యాజమాన్యంలోని ఉపాధ్యాయ, సిబ్బంది కోవిడ్ బారిన పడినట్లయితే వేతనంతో కూడిన సెలవు ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.. గురుకులాల్లో మరియు మోడల్ స్కూల్ లో పని చేస్తున్న అవర్లీ బేస్ డ్ మరియు గెస్ట్ టీచర్లు ,సీఆర్టి లను వెంటనే రెన్యువల్ చేయాలన్నారు. ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న సిఆర్టీ లకు జూన్ ,,జూలై,, ఆగస్టు వేతనాలు మంజూరు చేయాలని .రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బాకీయపడిన ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం నిరంకుశ వైఖరికి ఇది సరైన సమయం కాదని .ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థుల ఊర్లోకి వెళ్లి వారిని మానిటరింగ్ చేయడం అనే ఉత్తర్వులను వెంటనే విరమించుకోవాలన్నారు .కేజీబీవీ లో పనిచేస్తున్న సిబ్బందికి వేతనంతో కూడిన ప్రసూతి సెలవుల, రెండో శనివారం ఐచ్చిక సెలవు ఇవ్వాలని డిమాండ్. చేసారు. . పదోన్నతులు, బదిలీలు షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేసారు. పీఆర్సీ వెంటనే ప్రకటించాలన్నారు . తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తుందని ఉపాధ్యాయులు ఆదరిస్తూ అధిక సంఖ్యలో సభ్యత్వ నమోదు చేస్తూ సంఘాన్ని బలోపేతం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శాంతకుమారి. జిల్లా ఉపాధ్యక్షుడు షిండే హేమంత్, రెబ్బన ఎస్వో పద్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఎక్కువ మందిచదివినవి