Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

బీఎస్ ఎన్ ఎల్ ఉద్యోగుల ఆందోళన

తెలంగాణ వ్యాప్తంగా బీఎస్ఎన్ ఎల్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. రిలే దీక్షలు చేశారు. ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. బీఎస్ఎన్ ఎల్ కూడా 4 జి సేవలు ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. బీఎస్ ఎన్ ఎల్ ఆవిర్భావ దినోత్సవాన్ని బ్లాక్ డే గా నిర్వహించారు. హైదరాబాద్ లోని  ఆదర్శనగర్ బీ ఎస్ ఎన్ ఎల్ కార్యాలయం వద్ద శుక్రవారం ఆ సంస్థ ఉద్యోగులు, అధికారులు నిరాహారదీక్షకు దిగారు. ఈ సందర్భంగా బీఎస్ ఎన్ ఎల్  ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడు సాంబశివరావు మాట్లాడారు. 4 జి టెండర్లను ప్రభుత్వం కావాలనే రద్దు చేసిందని, ఇందుకు సహేతుకమైన కారణాలు ఏమీ లేవన్నారు. 4 జీ సర్వీసులు తక్షణం ప్రారంభించాలన్నారు. ప్రయివేటు కంపెనీలను ఇందుకు అనుమతించిన ప్రభుత్వం  బీఎస్ ఎన్ ఎల్ ను మాత్రం అడ్డుకుంటోందన్నారు. ప్రభుత్వ వైఖరి మారకపోతే నవంబరు నెలలో సమ్మె నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ టెలికాం ఎంప్లాయిస్  తెలంగాణ నాయకుడు కృష్ణారెడ్డి, ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ నాయకుడు జగదీష్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

ఎక్కువ మందిచదివినవి