100 గజాల స్థలం.. 010 ద్వారా జీతాలు 

*వక్ఫ్ బోర్డు ఉద్యోగుల ఆకాంక్ష ఇదీ  

(ఉద్యోగులు న్యూస్)


 తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగ ఉన్న వక్ఫ్ స్థలంలో వక్ఫ్ బోర్డు ఉద్యోగులకు 100 గజాల స్థలము  ఇవ్వాలని, వక్ఫ్ బోర్డు ఉద్యోగులకి 010 ద్వారా జీతభత్యాలు  హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు  ఎస్.ఎం.హుస్సేని (ముజీబ్)  ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ జిల్లా తెలంగాణ స్టేట్ వక్ఫ్ బోర్డు యూనిట్ నూతన ఆఫీస్ ప్రారంభ కార్యక్రమమం శనివారం జరిగింది. ఈసందర్భంగా  హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు  ముజీబ్  అధ్యక్షతన సమావేశం జరిగింది.  ముఖ్య అతిధులుగా తెలంగాణ రాష్ట్ర  బోర్డు చైర్మన్ మహమ్మద్ సలీం , చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహమ్మద్ ఖాసీం, వక్ఫ్ బోర్డు మెంబెర్ మహమ్మద్ వహీద్ అహ్మద్, వక్ఫ్ బోర్డు యూనిట్ అధ్యక్షులు మహమ్మద్ ఇబ్రహీం, కార్యదర్శి సయేద్ జలీల్ అహ్మద్,  కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. వక్ఫ్ బోర్డు యూనిట్ లోని వివిధ సమస్యలను  చైర్మన్ సలీంకి నివేదించారు. పీ.ఆర్.సి బకాయలు విడదల చేయాలని, కాంట్రాక్టు,  కన్సాలిడేటెడ్ ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేయాలనే తదితర   సమస్యలు  త్వరలో పరిష్కరించగలనని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కే.దేవేందర్, జె.బాలరాజ్, యస్.విక్రమ్ కుమార్, కె.ఆర్.రాజ్ కుమార్, ఉమర్ ఖాన్, ఖాలెద్ అహ్మద్, బి.శంకర్, సయెద్ వాజిద్ ఇక్బాల్ ర్హిజ్వీ పాల్గొన్నారు.