Tuesday 1st December 2020
ముఖ్యాంశాలు
  ఉపాధ్యాయుల బదిలీలవెబ్ కౌన్సెలింగుపై డెమో వాయిదా  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలి  ***  శాంతిఖని గనిలో టీజీబీకేఎస్ ద్వార సమావేశం  ***  మ్యాన్యువల్ కౌన్సిలింగే అవసరం  ***  సీపీఎస్ రద్దు కు మండలిలో ఎం ఎల్ సి రామకృష్ణ డిమాండ్  ***

ఆర్టీసీ గాడిన పడేవరకూ నిద్రపోను

* సంస్థ  పుంజుకొనే దిశగా  చర్యలు 

*   ఉన్నత స్థాయి సమీక్ష సిఎం కెసిఆర్

(ఉద్యోగులున్యూస్)

కరోనా వల్ల  నష్టపోయిన  ఆర్టీసీ పుంజుకోవాలని   ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు.  ప్రగతి భవన్ లో ఆర్టీసి పైన సిఎం కెసిఆర్ అధ్యక్షతన  ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంఆదివారం జరిగింది. ఆర్జీసి కార్మికులకు ఉద్యోగ భధ్రత కల్పించే విధివిధానాల పై చర్చించారు.   ఆర్టీసీ కార్మికులకు  పెండింగులో వున్న  రెండు నెలల  జీతాన్ని తక్షణమే చెల్లించాలని, .తక్షణమే 120 కోట్ల రూపాయలను విడుదల చేయాలని ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును సిఎం ఆదేశించారు. హైద్రాబాద్ నగరంలో బస్సు సర్వీసులను 50 శాతానికి పెంచాలని సిఎం నిర్ణయించారు.   ప్రభుత్వం  ప్రోత్సాహకాలతో   లాభాల బాట పడుతున్న ఆర్టీసీకి కరోనా కష్టాలను తెచ్చిపెట్టిందని అయినా  ఆర్టీసి ని తిరిగి బతికించుకుంటామని సిఎం స్పష్టం చేశారు.   తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కష్టాలొచ్చినా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటూ వస్తోందన్నారు. .ఆయా సంస్థల్లో పనిచేస్తున్న లక్షలాదిమంది ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగ భధ్రత నిస్తుందన్నారు . విద్యుత్ శాఖలో ప్రయివేటు భాగస్వామ్యం పెంచాలని ఎవరు ఎన్ని రకాల  ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించిందన్నారు.  వేలాది మంది విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యలరైజ్ చేసిందన్నారు.  కేంద్ర ప్రభుత్వం,ఎల్ ఐ సి సహా, ప్రభుత్వ రంగం సంస్థలను ప్రైవేట్ పరం చేస్తోందని  తెలంగాణ ప్రభుత్వం . ఎన్ని కష్టాలొచ్చినా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటుందని స్పష్టం చేసారు. . ఆర్టీసీ గాడిన పడేవరకూ నిద్రపోనని  నేనుంత కాలం ఆర్టీసీని బతికించుకుంటానని హామీ ఇచ్చారు.  ఆర్టీసీ మీద ఉద్యోగులు సహా ఆధారపడిన కటుంబాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయని, . ఆర్టీసీ అత్యంత చౌకయిన రవాణా వ్యవస్థ అన్నారు.  ప్రభుత్వం లాభ నష్టాల గురించి ఆలోచించకుండా ప్రజా రవాణా వ్యవస్థ, ఆర్టీసిని కాపాడుకుంటుందని భరోసా ఇచ్చారు. . ప్రభుత్వం ఆర్టీసి కి ఆర్ధికంగా  అండగా నిలుస్తుందన్నారు.  విశ్లేషించండి .. సంస్థను ముందుకే నడపండి కరోనా భయం, వ్యక్తిగత వాహనాల వాడకం  ఆర్టీసీలో ఆక్యుపెన్సీ రేషియో తగ్గడం  వల్ల  నష్టాల బాటపట్టిందని సమీక్షా సమావేశంలో అధికారులు సిఎం కెసిఆర్ కు వివరించారు. కరోనా కష్టాలను దాటుకుంటూ తగు నిర్ణయాలను తీసుకోవాలని, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆర్టీసీకి తిరిగి కోరోనా ముందటి పరిస్థితిని తీసుకురాగలమో అధికారులు విశ్లేషించుకోవాలని సిఎం ఆదేశించారు. ఆర్టీసీలో ప్రవేశపెట్టిన కార్గో సేవలను ప్రజలు గొప్పగా ఆదరిస్తున్నారని  ఈ సందర్బంగా సిఎం తెలిపారు. రాను రాను భవిష్యత్తులో రైల్వేలో మాదిరి, ఆర్టీసీ కూడా కార్గో సేవల తో లాభాలను గడిస్తుందని సిఎం ఆశాభావం వ్యక్తం చేశారు. కార్గో సేవలను ప్రారంభించిన అనతికాలంలోనే మిలియన్ పార్సెల్ ట్రాన్స్ పోర్టు చేసిన రికార్డును ఆర్టీసి సొంతం చేసుకోవడం పట్ల సిఎం ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి పువ్వాడను అధికారులను అభినందించారు. సిఎం కెసిఆర్ ఆదేశాలతో ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో జరిపిన చర్చల ఫలితంగా తెలంగాణ ఆర్టీసికి అధనంగా లక్షలాది కిలోమీటర్ల రవాణా హక్కు దక్కిందని, అందుకు ఆర్టీసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ అధికారులు, సిఎంకు  ధన్యవాదాలు తెలిపారు.  కరోనా అనంతర పరిస్థితుల నుంచి వొక్కొక్క వ్యవస్థ గాడిన పడుతుందని, వ్యవస్థలన్నీ  క్రమంగా పుంజుకుంటాయన్నారు.  ప్రజలు ఆర్టీసిని తిరిగి ఆదరించేలా  విధానాలను అవలంభించాలని కోరారు. ఈ సందర్భంగా సమీక్షా సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్.. సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్., సిఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావు , రెవిన్యూ శాఖ కార్యదర్శి శేషాద్రి, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు,  సిఎంవో అధికారులు, ఎంఏయుడీ డైరక్టర్ సత్యనారాయణ, పంచాయితీ రాజ్ కమీషనర్ రఘునందన్ రావు ,ఆర్టీసి ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.