Tuesday 1st December 2020
ముఖ్యాంశాలు
  ఉపాధ్యాయుల బదిలీలవెబ్ కౌన్సెలింగుపై డెమో వాయిదా  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలి  ***  శాంతిఖని గనిలో టీజీబీకేఎస్ ద్వార సమావేశం  ***  మ్యాన్యువల్ కౌన్సిలింగే అవసరం  ***  సీపీఎస్ రద్దు కు మండలిలో ఎం ఎల్ సి రామకృష్ణ డిమాండ్  ***

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల్లో వాటాలు చెల్లించాలి. 

 కొత్తగూడెం లోని సింగరేణి కార్యాలయం హెడ్ ఆఫీస్ వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. సింగరేణి లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కూడా లాభాల్లో వాటా చెల్లించాలని వారు కోరారు. ఇఫ్టూ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ప్రెసిడెంట్ వెంకన్న, వైస్ప్రెసిడెంట్ టి శ్రీనివాస్ మాట్లాడారు. సింగరేణి సంస్థ లాభాలు రావడం లో కాంట్రాక్ట్ కార్మికుల పాత్ర కీలకమని వారు అన్నారు. లాభాల్లో కీలక పాత్ర పోషించిన కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటాను ఇవ్వకపోవడం అన్యాయమని వారు వాపోతున్నారు.సమాన  పనికి సమాన వేతనం విధానాన్ని సింగరేణి సంస్థ అనుసరించడం లేదని,కరోనా  సమయంలో కూడా కాంట్రాక్ట్ కార్మికులు కష్టపడి పని చేశారని వారు పేర్కొన్నారు. అనంతరం సింగరేణి అధికారులకు వారు వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, మధుసూదన్, సతీష్,  శేఖర్ పాల్గొన్నారు.