సింగరేణిలో దీపావళి బోనస్ 68,500

(ఉద్యోగులు న్యూస్)

  సింగరేణి గని కార్మికులకు యాజమాన్యం  దీపావళికి బోనస్  ప్రకటించింది. పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ స్కీంలో భాగంగా  ఇది ప్రకటించారు.  ఏడాదికి  సిబ్బందికి ఒక్కొక్కరికి  దాదాపు రూ.68,500 చొప్పున అందుతుందని, దీపావళికి రెండు రోజుల  ముందే బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నట్లు  పర్సనల్ విభాగం స్పష్టం చేసింది. ల్ ఇండియా కార్మి కులు (నాన్ ఎగ్జిక్యూటివ్)తో సమానంగా సింగరేణి కార్మికులకు కూడా దీపావళి బోనస్ ఇవ్వాలని సంయుక్త ప్రతినిధులతో ఏర్పా టైన కమిటీ (జేబీసీసీఐ) నిర్ణయించింది. గత నెలలో లాభాల్లో వాటా ప్రకటించగా ఇప్పుడు దీపావళి బోనస్ ఇస్తుండటంతో  సింగరేణి ఉద్యోగులు , కార్మికులు ఆనందంలో ఉన్నారు.  ప్రస్తుతం ఇచ్చే  రూ. 68,500  మూలవేతనంతో  సంబంధం లేకుండానే నాన్ ఎగ్జిక్యూ టివ్ సిబ్బంది అందరికీ అందిస్తారు.