Tuesday 1st December 2020
ముఖ్యాంశాలు
  ఉపాధ్యాయుల బదిలీలవెబ్ కౌన్సెలింగుపై డెమో వాయిదా  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలి  ***  శాంతిఖని గనిలో టీజీబీకేఎస్ ద్వార సమావేశం  ***  మ్యాన్యువల్ కౌన్సిలింగే అవసరం  ***  సీపీఎస్ రద్దు కు మండలిలో ఎం ఎల్ సి రామకృష్ణ డిమాండ్  ***

కార్మికుల పై పని భారం పెరుగుతోంది. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి.

 శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్సీ 1 గనిపై  ఏర్పాటుచేసిన సమావేశంలో గురువారం ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోజురోజుకీ కార్మికులపై పనిభారం పెరుగుతోందని అయినా గుర్తింపు సంఘం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సంస్థ కొత్త  గనులు  ప్రారంభం చేయనప్పటికీ, ప్రస్తుత గనులలో ప్రైవేటు వ్యక్తులతో ఉత్పత్తి చేయి స్తుందని, గుర్తింపు సంఘం నాయకులు పైరవీలుకే  పరిమితమయ్యారని సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. ఈ సమావేశంలో ఏ ఐ టి యు సి బ్రాంచ్ కార్యదర్శి మోతుకూరి కొమురయ్య ఇతర నాయకులు పాల్గొన్నారు.