కార్మికులకు న్యాయం చేసేది తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘమే. 

 తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు ఆదివారం శ్రీరాంపూర్ లో సమావేశమై మాట్లాడారు. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ కార్మికులకు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ద్వారా న్యాయం చేస్తున్నామని, గతేడాది సెప్టెంబర్ లో ఇవ్వాల్సిన పదోన్నతుల ను యాజమాన్యంతో చర్చించి పరిష్కరించామని అన్నారు. శ్రీరాంపూర్ ఏరియా బొగ్గుగని కార్మిక సంఘంఉప  ప్రధాన కార్యదర్శి డి అన్నయ్యఏరియా ఉపాధ్యక్షుడు, సురేందర్ రెడ్డి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 20 18 డిసెంబర్ 31లోపు  విధుల్లో చేరి.  190 రోజులు,  240 రోజులు మస్తరులు పూర్తి చేసుకున్న శ్రీరాంపూర్ ఏరియాలోని    415 మంది బదిలీ వర్కర్లకు జనరల్ మజ్దూర్ లు  గా పదోన్నతి కల్పించడం తమ కృషి అని వారన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు కుమార్ స్వామిలక్ష్మణ్కాశి రావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.