Tuesday 1st December 2020
ముఖ్యాంశాలు
  ఉపాధ్యాయుల బదిలీలవెబ్ కౌన్సెలింగుపై డెమో వాయిదా  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలి  ***  శాంతిఖని గనిలో టీజీబీకేఎస్ ద్వార సమావేశం  ***  మ్యాన్యువల్ కౌన్సిలింగే అవసరం  ***  సీపీఎస్ రద్దు కు మండలిలో ఎం ఎల్ సి రామకృష్ణ డిమాండ్  ***

జీతాలకు  ఒకటో తారీఖే 


 *టీపీటీఎఫ్ డిమాండ్  

(ఉద్యోగులు న్యూస్)
 

బదిలీలు పదోన్నతులు జరపక  ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తితో  ఉన్నారని  టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొలుగురి కిషన్ రావు అన్నారు.  రాజన్న సిరిసిల్ల
జిల్లా చందుర్తి మండల కేంద్రములో విలేకరులతో మాట్లాడారు. .యాజమాన్యాల వారీ పదోన్నతులు  కల్పించాలని,అంతరజిల్లా బదిలీల ప్రక్రియని ప్రారంభించాలని , మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకి  బదిలీలు ప్రక్రియ చేపట్టాలని కోరారు.  రాజన్న సిరిసిల్ల జిల్లా అసోసియేట్ అధ్యక్షులు పంజాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ
ఉపాధ్యాయుల వేతనాలు ప్రతి నెలా ఒకటవ తారీఖునే చెల్లించాలని కోరారు.   మండల అధ్యక్షుడు కార్యదర్శులు తాటి కొండ సంజీవ్,  కర్ర శ్రీదర్  సీనియర్ కార్యకర్త చెన్నమనేని ఆంజనేయరావు పాల్గొన్నారు.