సార్వత్రిక సమ్మెకు టీఎస్ పీటీఏ మద్దతు
 

(ఉద్యోగులు న్యూస్) 


ఈనెల 26  జాతీయ సార్వత్రిక సమ్మెకు తెలంగాణ స్టేట్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్  సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సయ్యద్ షౌకత్ అలీ, నాగనమోని చెన్నరాములు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.  ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలు, అనేక సంస్థల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఈ ఆందోళన చేపడుతున్నట్లు వారు తెలిపారు.