సమగ్ర శిక్ష అభియాన్ లో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
*బహుజన కాన్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్
(ఉద్యోగులు న్యూస్)
సమగ్ర శిక్ష అభియాన్ సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని బహుజన కాన్ టీచర్సు అసోసియేషన్ డిమాండ్ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ సంఘం సమావేశం జరిగింది. సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ రిసోర్సు పర్సన్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, కస్తూరి బా పాఠశాలలో పని చేస్తున్న మహిళా ఉఫాధ్యాయులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు లక్ష్మీనారాయణ , పులి రాంగోపాల్ గౌడ్, బండారి మల్లేశం, సుధాకర్, ఎన్. అశోక్, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.