Tuesday 1st December 2020
ముఖ్యాంశాలు
  ఉపాధ్యాయుల బదిలీలవెబ్ కౌన్సెలింగుపై డెమో వాయిదా  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలి  ***  శాంతిఖని గనిలో టీజీబీకేఎస్ ద్వార సమావేశం  ***  మ్యాన్యువల్ కౌన్సిలింగే అవసరం  ***  సీపీఎస్ రద్దు కు మండలిలో ఎం ఎల్ సి రామకృష్ణ డిమాండ్  ***

కష్ట కాలం లో అండగా నిలబడదాం

*టీ ఎన్ జీ వో  నేత ఎస్. ఎం.హుస్సేని పిలుపు.

*రూ. 5 లక్షల సాయం

(ఉద్యోగులు న్యూస్)

తెలంగాణతో పాటు హైదరాబాద్ నగరంలో పదో తారీఖునుంచి కురిసిన భారీ వర్షాలకు అల్లకల్లోలమైన ప్రాంతాల్లో  హైదరబాద్ జిల్లా ఎన్జీవోలంతా సహాయ చర్యల్లో పాల్గొనాలని  టీ ఎన్ జీ వో  హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎస్. ఎం.హుస్సేని  పిలుపునిచ్చారు . టీఎన్ జీ వో హైదరాబాద్ జిల్లా భవన్ లో బుధవారం  సమావేశం జరిగింది . ఈ సమావేశంలో హుస్సేని మాట్లాడుతూ వరద బాధితుల కోసం తాను సొంతంగా రూ. 5 లక్షలు సాయం చేస్తున్నట్లు వెల్లడించారు . హైదరాబాద్ జిల్లా ఎన్ జీ వో లు అంతా వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపారు.హైదరాబాద్ జిల్లా కార్యవర్గం, వివిధ యూనిట్ ల  అధ్యక్ష, కార్యదర్సులు  మరియు ప్రాథమిక సభ్యులు తమ వంతు సహాయంగా ముందుకురావాలని కోరారు.  ఈ విపత్తు సమయంలో ప్రజలను ఆదుకోవాలని అన్నారు.  తెలంగాణ ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు గారు వరద సహాయానికి 550 కోట్లు మంజూరు చేయడంపట్ల వీరు  హర్షం వ్యక్తం చేశారు. విపత్తుల  సమయం లో ఎల్లప్పుడూ వారి వెనుక ఉంటామని హామీ ఇచ్చారు.