Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా బోనస్....ఉద్యోగులకు పండగ శుభవార్త చెప్పిన కేంద్రం.
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

టి‌ఎన్‌జి.యూనియన్ ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం జయంతి

 

టి‌ఎన్‌జి.యూనియన్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎస్.యుం.హుస్సైని (ముజీబ్) గారి ఆధ్వర్యంలో 11వ భారత మాజీ రాష్ట్రపతి ఏ.పీ.జే.అబ్దుల్ కలాం 89వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.కార్యదర్శి కె.దేవేందర్, సభ్యులు ఉమర్ ఖాన్, కుర్రాడి శ్రీనివాస్, టి.వెంకటేష్, యుం.ఏ.ముజీబ్, తదితరులు కలాంకు నివాళులర్పించారు. హుస్సేనీ మాట్లాడుతూ భారత రక్షణ విభాగానికి ఆధునిక వనరులు సమకూర్చడంలో కలాం కృషి ఎనలేనిదన్నారు. . హైద్రాబాద్ లోని డీఆర్డీఎల్ , ఆర్సీఐ అభివృద్ధిలో ఆయన పాత్ర ప్రశంశనీయమన్నారు. యువతకు ఆదర్శమని ఆయన దారిలో భారత దేశము, రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధి చెంది, ప్రపంచ దేశాలలో ముందుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎక్కువ మందిచదివినవి