మానవతా దృక్పథంతో వారిని  పాత డిపోలకు బదిలీ చేయాలి

*ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు రాజిరెడ్డి డిమాండ్ 


(ఉద్యోగులు న్యూస్) 


కరీంనగర్ ఆర్టీసీ రీజియన్ లో అక్కడి ఆర్ ఎం కొందరిని అన్యాయంగా ఇతర డిపోలకు బదిలీ చేశారని తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ బదిలీలు నిలుపుదల చేయాలని విన్నవించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.  బదిలీ చేసిన డిపోల్లో వారు చేరిన తర్వాత వ్యక్తిగతంగా తిరిగి వారిని  వారి డిపోలకు పంపాలని కోరుతూ దరఖాస్తులు కూడా సమర్పించారని తెలిపారు.
నిజామాబాద్ రీజనల్ మేనేజర్  కూడా కొందరిని కామారెడ్డి డిపో నుంచి బాన్సువాడ డిపోకు  బదిలీ చేశారని వారికి కూడా మానవతా దృక్పథంతో తిరిగి పాత డిపోలకు బదిలీ చేయాలని కోరారు.