Tuesday 24th November 2020
ముఖ్యాంశాలు
  • విస్తరిస్తున్న రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసు అసోసియేషన్
  • బడులు తక్షణం తెరవాలి
  • సమగ్ర శిక్ష అభియాన్ లోసమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
  • సార్వత్రిక సమ్మె నాడు ఎర్ర బ్యాడ్జీలతో విధులకు హాజరు
  • ఏపీ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసు అసోసియేషన్ విశాఖ జిల్లా అధ్యక్షునిగా రవికుమార్
  • అఖిల భారత సమ్మెకు ఏపీ టి ఎఫ్(257)మద్దతు
  • జాయింట్ కౌన్సిల్ ఏర్పాటు చేసిఉద్యోగుల సమస్యలపై చర్చించాలి
  • సార్వత్రిక సమ్మెకు తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ మద్దతు

ఆర్టీసీ కార్మికుల సమ్మె సైరెన్ 
 

* కార్మిక వ్యతిరేక విధానాల నిరసిస్తూ  నోటీసు జారీ 


    టీఎస్ఆర్టీసిలోని ఎంప్లాయీస్ యూనియన్ (ఎఐటియుసి), ఎస్. డబ్బు, ఎఫ్ (సిఐటియు) ఎస్.డబ్ల్యుయు (ఐఎయుసి), కార్మిక పరిషత్ (టిఎస్టియుసి) లు  నవంబరు  26న  సమ్మె చేస్తున్నట్టు గురువారం  ఆర్టీసి యాజమాన్యానికి  నోటీసు జారీ చేశాయి. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని  జాతీయ కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, అసోసియేషన్లు సంయుక్తంగా  ఇచ్చిన పిలుపుమేరకు సమ్మె చేస్తున్నట్టు   కె.రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి, ఎంప్లాయీస్ యూనియన్, ఎ వి. రావు, కోశాధికారి, ఎస్డబ్ల్యుఎఫ్, ఆర్.రమేష్ లు ప్రకటించారు.  ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ కార్మికులను కట్టు బానిసలుగా మార్చే కార్మిక చట్టాల సవరణ కోడ్ లను ఉపసంహరించాలన్నారు.  గ్రామీణ పట్టణ ప్రాంతాలకు నడుపుతున్న సర్వీసులలో ఆదాయానికి ఖర్చుకు మధ్యనున్న వ్యత్యాసాన్ని ప్రభుత్వాలే భరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలను ప్రైవేటు వ్యక్తులకు సంస్థలకు అప్పచూపుతోందన్నారు.   


సంఘాలన్నీ సమ్మెకు... 


కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జాతీయ కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, అసోసియేషన్లు సంయుక్తంగా   సమ్మెలో పాల్గొంటామని తెలిపాయి. జాతీయ కార్మిక సంఘాలు, ఆల్ ఇండియా కో-ఆర్డినేషన్ కమిటీ అఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఆరువేషన్ ఇచ్చిన పిలుపు మేరకు సమ్మెలో పాల్గొనాలని  కమిటీ నిర్ణయించింది. సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని ఆల్ ఇండియా కో-ఆర్డినేషన్ కమిటి లఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఆర్గనైజేషన్స్ పిలుపునిచ్చింది.నవంబర్ 26న జరుగనున్న సమ్మెలో పాల్గొనేందుకు వీలుగా ఈ సమ్మె నోటీసు ఇచ్చాయి. 

 *డిమాండ్లు ఇవీ 
*కార్మికులను కట్టు బానిసలుగా మార్చే కార్మిక చట్టాల సవరణ కోడ్లను ఉపసంహరించుకోవాలి

* ఎం.వి. యాక్ట్ చట్టం 2019 ను మార్చాలి

* ఆర్టీసిల ఆదాయాన్ని కొల్లగొట్టేందుకు అవకాశం కల్పిస్తున్న టూరిస్ట్ వర్మిట్స్ లో చేసే సవరణల ప్రయత్నాన్ని ఉపసంహరించాలి

* కరోనా నేపధ్యంల ర్టీసీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలి. గతంలో ప్లానింగ్ కమీషన్ సబ్ కమిటీ చేసిన సూచనల మేరకు 30.000 బస్సులను కేంద్రమే కొని ఆర్టీసిలకు అందించాలి
*  
పెట్రోల్, డీజిల్ ను జిఎస్టీ పరిధిలోకి తీసుకొని రావాలి. రాష్ట్రాలకు వచ్చే నష్టాన్ని కేంద్రమే భర్తీ చేయాలి

* గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు నడుపుతున్న సర్వీసులలో ఆదాయానికి, ఖర్చుకు మధ్యనున్న వ్యత్యాసాన్ని ప్రభుత్వాలే భరించాలి.

* ఇపిఎస్ పథకాన్ని మెరుగుపర్చాలి, కనీస పెన్షన్ రూ.10,000/- చెల్లించాలి.

డీజిల్ పై కేంద్రం విధిస్తున్న ఎక్సైజు డ్యూటీ, రాష్ట్రాలు విధిస్తున్న వ్యాట్ ను తగ్గించాలి. కనీసం ఆర్టీసిలకైనా వీటి నుండి మినహాయింపు ఇవ్వాలి.

విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేసేలా వున్న విద్యుత్ చట్ట సవరణల బిల్లు - 2020 ని ఉపసంహరించుకోవాలి

* వ్యవసాయాన్ని ప్రైవేటు శక్తుల చేతికి అందించేలా తీసుకొచ్చిన మూడు చట్టాలను రద్దు చేయాలి

*నిత్యావసర ధరలు తగ్గించాలి. చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి