కాంట్రాక్ట్ లెక్చరర్స్ బదిలీలకు సీఎం సుముఖం 

(ఉద్యోగులున్యూస్)
 


తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేస్తున్న  ఒప్పంద అధ్యాపకులు చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్న బదిలీలు జరుగనున్నాయి.  ముఖ్యమంత్రి  ప్రగతి భవన్ లో ఆదివారం  జరిగిన సమావేశంలో బదిలీల విషయమై  సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారని  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జి రమణారెడ్డి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ తెలిపారు . గత 13 ఏళ్లుగా  ఒకే కళాశాలల్లో పని చేస్తూ బదిలీ జరగక భార్యాభర్తలు కుటుంబాలకు, అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నవారికి ఉపశమనం కలుగుతుందన్నారు.  తమ బదిలీల విషయమై ప్రభుత్వం దృష్టికి అనేకసార్లు తీసుకెళ్లామని,  ఎట్టకేలకు ముఖ్యమంత్రి కాంట్రాక్ట్ లెక్చరర్ల బాధను అర్థం చేసుకున్నారని హర్షం వ్యక్తం చేశారు .  ముఖ్యమంత్రికి , విద్యాశాఖ మంత్రులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టర్స్ అసోసియేషన్-475 తరపున కృతజ్ఞతలు తెలిపారు.