తెలంగాణ కాంట్రాక్టు లెక్చరర్లకు వేతనాలు మంజూరు
 

( ఉద్యోగులు న్యూస్)

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో  పని చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు పెండింగులో ఉన్న వేతనాలు మంజూరయ్యాయి. ఏప్రిల్, మే నెలల  పెండింగు వేతనాలతో పాటు డిసెంబర్ వరకు వేతనాలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయని తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వ కళాశాలల అసోసియేషన్  రాష్ర్ట అధ్యక్ష, కార్యదర్శులు జి.రమణారెడ్డి, కొప్పి శెట్టి సురేష్ లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి  హరీశ్రావు, విద్యామంత్రి , ప్రత్యేక కార్యదర్శికి వారు ధన్యవాదాలు తెలిపారు.