అబ్కారీ శాఖలో పదోన్నతులు 
 

(ఉద్యోగులు న్యూస్)
 

అబ్కారీ శాఖలోపదోన్నతులు కల్పిస్తామని డైరెక్టర్ ఆఫ్ ప్రొ హిబిషన్ ఎక్స్సైజ్  సర్పరాజ్ అహ్మద్ భరోసా ఇచ్చారని  తెలంగాణ ఆబ్కారీ గెజిటెడ్ అధికారుల  సంఘం తెలిపింది.   సంఘం అధ్యక్షుడు టి. రవీందర్ రావు, టి జి ఓ  ప్రధాన కార్యదర్శి ఏ. సత్యనారాయణ, కోశాధికారి టి. లక్ష్మణ్ గౌడ్, సహా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ లు అబ్కారీ భవన్లో  సర్పరాజ్ ను కలిసి  శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాది  అబ్కారీశాఖ పనితీరు బావుందని,  ఆబ్కారీ రెవెన్యూ ఆదాయం బాగా పెరిగిందని సర్పరాజ్ కితాబిచ్చారన్నారు.    ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తామన్నారన్నారు.