పెన్షనర్స్ డైరీ ఆవిష్కరణ
(ఉద్యోగులు న్యూస్)
తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసిఏషన్ ప్రచురించిన 2021 డైరీ ఆవిష్కరణ షోయబ్ హాల్, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశం లో ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, అఖిల భారత ప్రభుత్వ పెన్షనర్ల సమాఖ్య సెక్రెటరి జనరల్ జి. పూర్ణచందర్ రావు, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల
జేఏసి చైర్మన్ కే. లక్ష్మయ్య పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో పెన్షనర్లు హాజరయ్యారు. ఈ సమావేశానికి పెన్షనర్స్ సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఏ. రాజేంద్ర బాబు అధ్యక్షత వహించారు. చుక్కా రామయ్య గారు మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యలు పరిష్కారం కావడానికి పోరాటమే శరణ్యం అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న పెన్షనర్ వ్యతిరేక చర్యలను పూర్ణచందర్ రావు వివరించారు., కోవిడ్ సందర్భంగా పెన్షన్లలో కోతను ఏవిధంగా అడ్డుకున్నది లక్ష్మయ్య తెలిపారు. పెన్షనర్లకు మెడికల్ సౌకర్యాలను కల్పించాలని వెల్నెస్ సెంటర్ లకు విధిగా మందులను సరఫరా చేయాలని కోరారు.