ఒక్క పదోన్నతి చాలు...

* వ్యవసాయ విస్తరణ అధికారుల డిమాండ్ 

ఉద్యోగులు న్యూస్

 తెలంగాణ వ్యవసాయ విస్తరణ అధికారులు సంఘం డైరీ 2021ని వ్యవసాయ శాఖ మంత్రి  సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి   ఆవిష్కరించారు.  కేంద్ర టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు  మావిళ్ల రాజేందర్, టిఏఈవోస్  రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శి సురేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగలో  డిప్లొమా  ఏఈవోల సమస్యలపై  మంత్రికి  వివరించారు. తమలో  డిప్లమా విద్యార్హత కలిగిన వారికి  ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పదవీ విరమణ పొందే వరకు ఒకే క్యాడర్లో విధులు నిర్వర్తిస్తునరన్నారు. మొత్తం ఉద్యోగ సర్వీస్ లో  కనీసం ఒక పదోన్నతినైనా  కల్పించాలని కోరారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయ శాఖలో అధిక సంఖ్యలో గ్రేడ్-2 వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించారని  దానికి అనుగుణంగా 20శాతం గ్రేడ్-1 క్యాడర్ పోస్టుల్లో సంఖ్యను పెంచాలన్నారు.  గ్రేడ్-1 పోస్టులకు డిప్యూటీ అగ్రికల్చర్ ఆఫీసర్ గా  పేరు  మార్చి పదోన్నతి కల్పించి పదోన్నతి లేని గ్రేడ్-1 వ్యవసాయ విస్తరణ అధికారులను ఆత్మస్థైర్యాన్ని పెంచాలని కోరారు.


ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘం కార్యవర్గ సభ్యులు  మరియు వివిధ జిల్లాల అధ్యక్షులు కార్యదర్శులు బాలస్వామి,ముజీబ్, శివయ్య,లింగస్వామి, శివుడు,పాండు,బాలరాజు,శ్యామ్, నాగన్న,శివుడు,జయ ప్రకాష్,శ్రీనాథ్, నరసింహ,తదితరులు పాల్గొన్నారు.