Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం

ఉత్తర్వుల విడుదల

(ఉద్యోగులు న్యూస్)

తిరుమల తిరుపతి దేవ స్థానం (టీటీడీ) ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం చెల్లింపులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2019 బ్రహ్మోత్సవాలకు సంబంధించి రూ.14,000 కొన్ని కేటగిరీలకు రూ.6,850 మరికొన్ని కేటగిరీలకు బహుమానం నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ఇప్పటికే ఇందుకు సంబంధించి బోర్డు నిర్ణయం తీసుకోగా, కార్యనిర్వహణాధికారి సిఫార్సుల మేరకు ఈ ఆదేశాలు వచ్చాయి.

టీటీడీ ఉద్యోగులు, హిందూ ధర్మ ప్రచార పరిషత్తులో డిప్యుటేషన్ పై పని చేస్తున్న వారికి, టైం స్కేలు ఉద్యోగులు, కన్సాలిడేటెడ్ పే పై పని చేస్తున్న వారికి ఇది వర్తిస్తుంది.

కాంట్రాక్టు, ఔట్ సోర్సింగు ఉద్యోగులకు కాల్ సెంటర్ ఉద్యోగులు, ఎఫ్ ఎంఎస్ ఉద్యోగులకు రూ.6,850 ఇవ్వనున్నారు. నిర్మాణ కాంట్రాక్టు పనుల్లో చేసే వారికి  ఇది వర్తించదు. 2019 అక్టోబరు 30 నాటికి వారు ఇక్కడ పని చేస్తూ ఉంటేనే వీరు అర్హులు . ఈ విషయంలో సంబంధిత కాంట్రాక్టరుకు ఎలాంటి కమిషన్ చేరకుండా పూర్తిగా ఉద్యోగులు మాత్రమే లబ్ధి పొందేలా అధికారులుచర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.