Tuesday 1st December 2020
ముఖ్యాంశాలు
  ఉపాధ్యాయుల బదిలీలవెబ్ కౌన్సెలింగుపై డెమో వాయిదా  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలి  ***  శాంతిఖని గనిలో టీజీబీకేఎస్ ద్వార సమావేశం  ***  మ్యాన్యువల్ కౌన్సిలింగే అవసరం  ***  సీపీఎస్ రద్దు కు మండలిలో ఎం ఎల్ సి రామకృష్ణ డిమాండ్  ***

జాబ్ చార్టు లేని చాకిరీ ఎలా చేస్తాం?

 

* ఆన్ లైన్ అంటారు- కంప్యూటర్లు ఇవ్వరు

* సహాయకులు లేకుండా ఇంత పని ఎలా

* పంచాయతీ కార్యదర్శుల ఒత్తిడిపై టీఎన్జీవోల చర్చ..

(ఉద్యోగులు న్యూస్)
 

ఈరోజు టీఎన్జీవో భవన్లో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సమావేశం జరిగింది. సెంట్రల్ ఫోరమ్  ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్ హాజరయ్యారు. సమావేశంలో పంచాయతీ కార్యదర్సుల  పని ఒత్తిడిపై చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలోని పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులుపై  అధికారులు, పంచాయతీ కార్యదర్శుల యొక్క జాబ్ చార్ట్ నిర్దిష్ట  పనివేళలు అమలుపరచాలని వారు కోరారు.గత సంవత్సర కాలంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకం జరగలేదని, తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖలో కీలకమైన స్థానంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శుల పై పని ఒత్తిడి అధికంగా కల్పించారని వారు పేర్కొన్నారు. ఆన్లైన్ అప్లికేషన్ల తో  విధులు నిర్వహించాల్సి నదిగా ఆదేశాలు జారీ చేసే  అధికారులు వారికి కావలసిన పరికరాలను కంప్యూటర్,ఇంటర్నెట్, ఫోన్ లాంటి సౌకర్యాలు కల్పించడం లేదని వారు విమర్శించారు. గ్రామాల్లో అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులు  నిర్వహిస్తున్న టువంటి పంచాయతీ కార్యదర్శులు పై ఎన్ ఆర్ జిఎస్ వంటి కార్యక్రమాలు, ఉపాధి హామీ పథకం పనుల ఒత్తిడి పడిందని నియామకసమయంలో కార్యదర్శులకు ఉన్నటువంటి జాబ్ చార్ట్ కు  అదనంగా,  పంచాయతీ కార్యదర్శులకు పని వత్తిడి పెంచే కార్యక్రమాల అధికారులు కలగ  చేస్తున్నారని వారు ఆవేదన చెందారు.  ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ లను  తొలగించిన తర్వాత వారి పని ఒత్తిడి కూడా పంచాయతీ కార్యదర్శుల పై పడిందని, దానికి తోడు ఎన్ఆర్ఈజీఎస్ కార్యక్రమాలు కూడా భారంగా పరిణమించాయని  వారు ఆవేదన వ్యక్తం చేశారు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఒక రిని  కార్యదర్శులకు సహాయకంగా నియమించాలని అలాగే సస్పెండ్ అయిన గ్రామ కార్యదర్శులను పునర్ నియమించాలని వారుకోరారు. ఆన్లైన్ విధులు నిర్వహించడానికి అవసరమైన అటువంటి పరికరాలు కంప్యూటర్ ఇంటర్నెట్ ఫోన్ లాంటి సౌకర్యాలను గ్రామ పంచాయతీ స్థాయిలో కార్యదర్శులకు అందుబాటులో ఉంచాలని వారు డిమాండ్ చేశారు ఈ సమావేశానికి తెలంగాణ పంచాయతీ కార్యదర్శిల  సెంట్రల్ ఫోరం అధ్యక్షులు టి  పర్వతాలు,  అడహాక్ కమిటీ కన్వీనర్ మహేష్ మరియు సభ్యులు ఆయా జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు హాజరయ్యారు.