Tuesday 1st December 2020
ముఖ్యాంశాలు
  ఉపాధ్యాయుల బదిలీలవెబ్ కౌన్సెలింగుపై డెమో వాయిదా  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలి  ***  శాంతిఖని గనిలో టీజీబీకేఎస్ ద్వార సమావేశం  ***  మ్యాన్యువల్ కౌన్సిలింగే అవసరం  ***  సీపీఎస్ రద్దు కు మండలిలో ఎం ఎల్ సి రామకృష్ణ డిమాండ్  ***

విద్య కార్పొరేటీకరణకే ఎన్ఈపీ 

*యుటిఎఫ్

జాతీయ నూతన విద్యా విధానం 2020(ఎన్ ఈ పీ) ద్వారా కేంద్ర ప్రభుత్వం విద్యను కార్పొరేటీకరణకు ప్రయత్నిస్తోందని, లోపభూయిష్టమైన ఈ విధానాన్ని తమ సంఘం తిరస్కరిస్తున్నట్లు యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ జిల్లా అధ్యక్షులు పొందూరు అప్పారావులు స్పష్టం చేశారు. రణస్థలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రణస్థలం మండల శాఖ అధ్యక్షులు ఎల్ కోదండరాం, మండల కోశాధికారి కుమారస్వామి, నాయకులు నాగరాజు, రాంప్రసాద్, కామేష్, లక్ష్మణరావు తదితరులతో కలిసి వారు సందర్శించారు. ఉపాధ్యాయ అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు రైల్వేలు ,ఇన్సూరెన్స్ ,టెలికాం, బ్యాంకింగ్ వంటి సంస్థలను ప్రైవేటు పరం చేస్తోందన్నారు. విద్యారంగానికి నిధులు కేటాయించకుండా , కామన్ స్కూల్ సిస్టం ప్రస్తావన లేకుండా, నూతన విద్యా విధానం ద్వారా దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పథం లోకి తీసుకు వెళ్తారో ప్రజలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో చర్చ జరగకుండా నూతన విద్యా విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు జరపడానికి , రాష్ట్ర ప్రభుత్వం సరేనని అనడం సరికాదన్నారు. జాతీయ నూతన విద్యా విధానం ద్వారా అసమానతలతో కూడిన సమాజం ఏర్పడుతుందని, పేదలకు విద్య దూరమవుతుందని, లోపాలను సరిదిద్దాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు తన హామీ మేరకు సిపిఎస్ ను రద్దు చేయాలని, పిఆర్సీ ప్రకటించాలని గిరిధర్ అప్పారావులు కోరారు.