Monday 18th January 2021
ముఖ్యాంశాలు
  పారామెడికల్ ఉద్యోగుల క్రమబద్దీకరణ పైత్వరలోనే సానుకూల నిర్ణయం  ***  పీఆర్సీ ఇవ్వకుంటే ఫిబ్రవరిలో ప్రత్యక్ష కార్యాచరణే  ***  తెలంగాణ ముద్ర కనబడే లామొదటి పి.ఆర్.సి ఇవ్వండి  ***  రైతు ఉద్యమానికి టిఎస్ యుటిఎఫ్ సంఘీభావం  ***  ప్రకాశం జిల్లా ఏపీజిఈఎఫ్ చైర్మన్ గా రాజారావు  ***  కాంట్రాక్టు పారా మెడికల్ ఉద్యోగులను క్రమబద్దీకరించండి  ***  త్వరలో వీఆర్వోల ఆత్మగౌరవ సభ  ***  పంచాయతీ కార్యదర్శుల స్పెషల్ ఫోరమ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా మహేష్  ***

ఉద్యోగుల నుంచి వసూలు చేస్తే10 రెట్లు జరిమానా

* ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో ఆస్పత్రులకు హెచ్చరిక

*సంరక్షణ పథకం కింద చికిత్స చేయాల్సిందే

రాష్ట్రంలో ఎంపానెల్ ఆస్పత్రిల్లో ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం కింద వైద్య సేవలు అందించాలని, కాష్ పేమెంట్ కోసం ఎట్టిపరిస్థితుల్లోనూ ఒత్తిడి చేయొద్దని డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ముఖ్య కార్య నిర్వహణాధికారి స్పష్టం చేశారు.ఉద్యోగులను, పెన్షనర్లను ఆరోగ్య సంరక్షణ పథకం కింద మాత్రమే చికిత్స చేయాలని ఈ సూచనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. చికిత్స కోసం వచ్చే వారి నుంచి సొమ్ము వసూలు చేస్తే అంతకు పది రెట్లు పెనాల్టీ విధిస్తామని ఆ ఎంతైనా ఆస్పత్రిని అన్ని ప్రభుత్వ స్కీముల నుంచి మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.  

ఆరోగ్య సంరక్షణ పథకం కింద అడ్మిట్ చేసుకోవడం లేదంటూ వచ్చినఫిర్యాదులపై సీఈవో ప్రకటన విడుదల చేశారు. ఎంపానెల్ ఆస్పత్రులకు ట్రస్టు ద్వారా రూ. 31 కోట్లు విడుదల అయిందని మరో రూ. 16 కోట్లు త్వరలో విడుదల కాబోతున్నాయన్నారు. ఉద్యోగుల నెలసరి కాంట్రిబ్యూషన్ రూ.90, రూ నుంచి రూ. 225 , 120 నుంచి రూ. 300 లకు పెంచినట్లు తెలిపారు. ఆసుపత్రులకు వచ్చే రోగులకు సక్రమంగా కౌన్సిల్ చేయాలని, వారిని మెడికల్ రియంబర్స్మెంట్ పెట్టుకోమని సూచించ వద్దని ప్రకటనలో పేర్కొన్నారు.

ఎక్కువ మందిచదివినవి