వ్యవసాయ శాఖలో త్వరలో అదనపు పోస్టులు

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జులై 15

రాష్ట్రంలో వ్యవసాయ శాఖలో త్వరలో 92 అదనపు పోస్టులు మంజూరు కానున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఎండి ఇక్బాల్ అన్నారు. నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం బుధవారం జరిగింది .ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఇక్బాల్ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కురసాల కన్నబాబు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య తదితరులు సహకారంతో వ్యవసాయ శాఖలో కొత్త పోస్టులు మంజూరుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. చాలా కాలంగా ఖాళీగా ఉన్నా డ్రాప్స్మెన్ ట్రేసర్ తదితర పోస్టులకు బదులు సీనియర్ అసిస్టెంట్ సూపర్డెంట్ పరిపాలన అధికారి పోస్టులు పెంచుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాలు ఈ కార్యక్రమానికి  చేయూతనివ్వాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ అదనపు పోస్టులు మంజూరు వ్యవసాయ శాఖ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీధర్ కార్యదర్శి దయ బాబు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజేంద్ర రాష్ట్ర శాఖ ప్రచార కార్యదర్శి డి ఎస్ న్ శ్రీనివాస్ సంయుక్త కార్యదర్శి ఎన్ శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు .సమావేశం అనంతరం రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఇక్బాల్ కార్యదర్శి ప్రసాద్ తదితరులను నెల్లూరు జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.