Thursday 24th June 2021

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 డీఏల కోత

*పెన్షనర్లకు కూడా

*కేంద్రం తరహాలోనే

*రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు

(ఉద్యోగులు న్యూస్)

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు , పెన్షనర్లకు ,కరోనా సంక్షోభం కారణంగా మూడు డీఏలు కోత విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఇప్పటికే మూడు డీఏలు ఫ్రీజ్ చేస్తూ నిర్ణయించిన బాటలోనే రాష్ట్రమూ తాజా నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 2020 జనవరి. 2020 జులై 2021 జనవరి నెలలకు కరవు భత్యం ఇవ్వబోమని, ప్రకటించింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్ ఆదేశాలు ఇచ్చారు. కరోనా కారణంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగోక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు