Wednesday 21st April 2021

కారుణ్య నియామకాలు అందరికీ వర్తించాలి.

* గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం(361/2020)

(ఉద్యోగులు.న్యూస్), (ఉద్యోగులు. కామ్)

  రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కారుణ్య నియామకాలు అందరికీ వర్తింపజేయాలని,  కారుణ్య నియామకాలకు సంబంధించి 2019 అక్టోబర్ 2 నుండి విధుల్లో ఉన్న వారికి  వర్తింపజేయాలని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం(361/2020) అధ్యక్ష  ప్రధాన కార్యదర్శులు కోరుతున్నారు. రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల కు కారుణ్య నియామకాలు కు ప్రభుత్వం నిర్ణయించడం అభినందించదగ్గ విషయమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అనుబంధ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ రజాక్ పేర్కొన్నారు. తమ సంఘం నిరంతరం సచివాలయ ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తోందని గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల ప్రధాన సమస్యలను  ఉద్యోగులు న్యూస్ ద్వారా కూడా ప్రభుత్వానికి అధికారులకు విన్నవించడం జరిగిందని ఆయన ఒక ప్రకటన  లో పేర్కొన్నారు . ఈనెల 18వ తేదీన జరిగిన ఉద్యోగ సంఘాల సమావేశంలో కూడా ఈ మేరకు విజ్ఞప్తి చేశామని వెంటనే ప్రభుత్వ ఆదేశాల కొరకు ఆ ఫైల్ ను పంపించడం ఆనందకరమైన విషయం అన్నారు .వార్డు సచివాలయ వ్యవస్థలో పని చేయడం తమకు ఎంతో గౌరవప్రదమైన విషయమని పేర్కొన్నారు. వార్డు సచివాలయ సిబ్బంది సమస్యల పట్ల ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న చొరవ పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.