ఏసీబీ కేసుల్లో 100 రోజుల్లో ఛార్జిషీట్
 

* చట్ట సవరణకు రాష్ర్ట మంత్రిమండలి నిర్ణయం
* లేకుంటే ఏసీబీ అధికారులపైనా చర్యలు
* రాష్ర్ట మంత్రి పేర్ని నాని వెల్లడి

(ఉద్యోగులు.న్యూస్), (ఉద్యోగులు. కామ్)


అవినీతి నిరోధకశాఖ ఎవరైనా అధికారులను, ఉద్యోగులను రెడ్ హ్యాండెడ్ గా పట్టకుంటే  మూడు నెలల్లోపు (100 రోజులు)  ఛార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంటుందని రాష్ర్ట మంత్రి మండలి నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన చట్ట సవరణ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం  రెండు ఏళ్ల వరకు  గడువు ఉంది. ఒక వేళ ఏసీబీ ఛార్జిషీట్ గడువు లోపు దాఖలు చేయకపోతే సంబంధిత ఏసీబీ అధికారులపైనా చర్యలు తీసుకునేలా చట్ట సవరణ చేయనున్నారు. రాష్ర్ట మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశంలో ఈ విషయం చెప్పారు.

ఎక్కువ మందిచదివినవి