Wednesday 21st April 2021

బొప్పరాజు సృష్టించే వివాదాలతో ఉద్యోగులకు ఏం ప్రయోజనం?
 

-    ఆయన అన్నీ తన ఖాతాలో వేసుకుంటారు
-    ఇప్పుడు వీఆర్వోల ప్రమోషన్ల వంతు
-    ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు ఆస్కార్ రావు, శ్రీకాంతరాజు నాగ సాయి లు విమర్శలు

 

(ఉద్యోగులు. న్యూస్), (ఉద్యోగులు.కామ్)
రెవెన్యూ సర్వీసు అసోసియేషన్ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు పదే పదే మీడియా ముందుకు వచ్చి ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం కలిగించని విషయాలను వివాదాస్పదం చేస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు, ఇతర నేతలు శ్రీకాంతరాజు,  విమర్శించారు. బొప్పరాజుకు ఇది అలవాటుగా మారిందన్నరు. విజయవాడలో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. వీఆర్వోల ప్రమోషన్లకు సంబంధించి గురువారం బొప్పరాజు మీడియా సమావేశంపై వీరు స్పందించారు. ప్రతి విమర్శలు చేశారు. కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగుల సమస్యలను జటిలం చేయడానికి ఆయనే అడ్డుపడుతున్నారని విమర్శించారు. మిగిలిన సంఘాలు కృషిచేసి ఉద్యోగ సమస్యలను పరిష్కరించే తరుణంలో చివరగా ఆ సమస్య ఆయనే పరిష్కరిస్తున్నట్లు "మేకప్" చేయడం బొప్పరాజుకు అలవాటుగా మారిందన్నారు.
వీఆర్వోలకు సీనియరు అసిస్టెంట్లకు ప్రమోషన్లు కల్పించే జీవో సవరణ ప్రక్రయ తుది దశకు చేరడంతో అది బొప్పరాజు తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇప్పుడు కావాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఆ  సంఘం నేత కే ఆర్ సూర్యనారాయణపై బురద జల్లుతున్నారని విమర్శించారు.బొప్పరాజు గారి రెవిన్యూ సంఘంలో కేవలం జూనియర్ ఆపిస్టెంట్ లు, సీనియర్ ఆపిస్టెంట్లు , డిప్యూటీ తహశీల్దారులు మాత్రమే సభ్యులుగా ఉన్నారు. మిగిలిన తహశీల్దారు, సర్వేయర్లు, వి.ఆర్.ఎ., వి.ఆర్.ఒ., డిప్యూటీ కలెక్టరు వంటి అనేక కేడర్ సంఘాలు విడిగా పనిచేసుకుంటోంటే  ఆ సంఘాలు తమతో  ఉన్నట్లుగా ఉద్యోగులను, మీడియాను నమ్మించే ప్రయత్నం బొప్పరాజు చేస్తున్నారని విమర్శించారు.

వారంతా  ప్రస్తుతం తమ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలోనే కొనసాగుతున్నారని ఆస్కార్ రావు, శ్రీకాంత్ రాజు లు అన్నారు.  ఇటీవల సీఎస్ తో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో బొప్పరాజు మాట్లాడుతూ వీఆర్వోలకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి ఇవ్వకూడదని   ప్రకటించారని పేర్కొన్నారు.  వారం రోజుల్లోనే ఆయన తన విధానం ఎందుకు మార్చుకున్నారని ప్రశ్నించారు.