Wednesday 21st April 2021

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రత్యేక సెల్?
 

- ప్రభుత్వ ఉత్తర్వులు
(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు. కామ్)


ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో మరో అడుగు ముందుకు పడిందా? తాజాగా ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు ఇచ్చింది. కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థను సరైన మార్గంలో పెట్టేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ సెల్ వారికి సంబంధించిన విషయాలు అధ్యయనం చేస్తుంది. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలతో  చర్చల తర్వాత ఒక్కొక్కటిగా ఉత్తర్వులు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి ప్రత్యేక సెల్ ఏర్పాటయింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ సెల్ ఏర్పాటు ఉద్దేశం ఏమిటి అనేది పూర్తిగా బయటకు రాలేదు.
కాంట్రాక్టు ఉద్యోగులను వీలైనంత మందిని రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే వారికి హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో వారి అంశాలు అధ్యయనం చేసేందుకు ఈ సెల్ ఏర్పాటు చేయడం చర్చనీయాంశమవుతోంది.