కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పై నాన్చుడు ధోరణి సరికాదు
 

* ఆ సంఘం జేఏసీ రాష్ర్ట కన్వీనర్ ప్రసాద్
(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు. కామ్)

అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ అంశంపై ప్రభుత్వానికి నాన్చుడు ధోరణి ఎంతమాత్రం తగదని ఆంధ్రప్రదేశ్ డి.ఎస్.సి కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల జె.ఏ.సి రాష్ట్ర కన్వీనర్ జి.వి.వి.ప్రసాద్ పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసిందంటూ వార్తలు రావడంతోకాంట్రాక్టు ఉద్యోగుల సంఘం నాయకుడు ప్రసాద్ పై విధంగా స్పందించారు. సాక్షాత్తూ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర లోనూ, ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మ్యానిఫెస్టోలోనూ ఎంతో స్పష్టంగా అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులర్  చేస్తమన్నారని గుర్తు చేశారు. ఇప్పటీకీ ఆ హామీ నెరవేర్చలేదన్నారు. జగనన్న పాలనలోనూ కమిటీ ల పేరిట కాలయాపన జరుగుతుండటాన్ని కాంట్రాక్టు ఉద్యోగులు సహించలేకపోతున్నారని ప్రసాద్ పేర్కొన్నారు.


ఏళ్ల తరబడి సర్వీసు రెగ్యులరైజేషన్ కోసం దాదాపుగా ఇరవై ఏళ్ళుగా ఎదురుచూస్తున్న వైద్య ఆరోగ్య శాఖ లోని కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఇంకా అలా పెండింగులో వుండగానే, రెండేళ్లు కూడా పూర్తి చేసుకోని సచివాలయ ఉద్యోగుల ప్రొబెషనరీ కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ప్రసాద్ ప్రస్తావిస్తూ ఇది ఎంతవరకు సబబని అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. సచివాలయ ఉద్యోగులను  రెగ్యులరైజేషన్ చెయ్యాలని ప్రభుత్వం తలపెట్టడం సంతోషించదగ్గదేనని, అయితే అదే కోణంలో ఎన్నికల్లో మీరిచ్చిన మాట మేరకే అర్హులైన వారినైనా త్వరితగతిన రెగ్యులర్ చేసి కాంట్రాక్టు ఉద్యోగులను ఆదుకోవాలని వారు ప్రాధేయపడుతున్నారని ప్రసాద్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

ఎక్కువ మందిచదివినవి