ఏకీకృత సర్వీసు రూల్సు సాధిస్తా
 

- ఆరు నెలల్లోపే సమస్య పరిష్కరిస్తా
- ఉపాధ్యాయులకు కల్పలత  హామీ

(ఉద్యోగులు.న్యూస్), (ఉద్యోగులు. కామ్)


ఎప్పటి నుంచో పెండింగులో ఉన్న ఉపాధ్యాయుల ఏకీకృత రూల్సును సాధిస్తానని కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి తమటం కల్పలత ప్రకటించారు. ఆమె ఆదివారం వివిధ చోట్ల ప్రచారం చేశారు.  మూలపాడు నుంచి పెనుగంచిప్రోలు వరకు అనేక మంది ఉపాధ్యాయులను కల్పలత కలుసుకున్నారు. మొదటి ప్రధాన్య  ఓటు తనకే వేసి గెలిపించాలని చెబుతున్నారు. పది అంశాల మేనిఫెస్టో లో పేర్కొన్న అంశాలు కరపత్రాలుగా పంపిణీ చేస్తున్నారు.
గుంటూరులో ఆదివారం ఒక ఫంక్షన్ హాలులో  కస్తూరి బా గాంధీ విద్యాలయాల టీచర్ల సమావేశం నిర్వహించారు. రెండు జిల్లాల టీచర్లు సమావేశమై ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు. కల్పలతకు మద్దతు ఇవ్వాలని వారు నిర్ణయించినట్లు ఆమె శిబిరంలోని నాయకులు తెలిపారు. 


ఆదివారం కూడా వివిధ ఉపాధ్యాయ సంఘాలు కల్పలతకు మద్దతుగా ప్రచారం సాగించాయి. కృష్ణా జిల్లా నందిగామ మండలంలో బహుజన టీచర్సు  అసోసియేషన్ కల్పలతకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.  పీఆర్ టీయూ సంఘాలు, ఆంధ్రప్రదేశ్ టీచర్సు గిల్డ్ తదితర సంఘాలు అనేక చోట్ల ప్రచారం చేపట్టాయి.

ఎక్కువ మందిచదివినవి