ఒకటో తేదీ జీతాలు ఇవ్వాలి

బండి శ్రీనివాసరావు...

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జులై 15- 

 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు .ఏపీ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి పదవీ విరమణ సత్కార సభ లో ఆయన మాట్లాడుతూ సి ఎఫ్ ఎం ఎస్ అధికారుల లోపభూయిష్ట చర్యలవల్ల ఉద్యోగులకు ఒకటో తేదీ జీతాలు ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని ఆయన అన్నారు .ఒకటో తేదీ వస్తుందంటే ఉద్యోగులకు పండగని జీతాల కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటారని బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు. అలాగే  పిఆర్సి  కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ఇటీవల పెంచిన 3 డి ఎ ల అరియర్స్ పదవి విరమణ చెందిన ఉద్యోగుల యొక్క పింఛన్ గ్రాట్యుటీ జిపిఎఫ్ బిల్లులు పెండింగ్లో ఉండడం వల్ల  ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అలాగే చనిపోయిన ఉద్యోగుల  అంత్య క్రియల ఖర్చులు కూడా చెల్లించడంలో జాప్యం పట్ల  శ్రీనివాసరావు ఆందోళన వెలిబుచ్చారు. ముఖ్యమంత్రి చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఉద్యోగులు కీలక పాత్ర వహిస్తున్నారని ఉద్యోగుల సంక్షేమానికి కూడా ముఖ్యమంత్రి పట్టించుకుంటారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తపరిచారు.