ఐటిడిఎ పిఓ వైఖరిపై ఉద్యోగ సంఘాల ధ్వజం

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)

జులై 21- రంపచోడవరం ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్ ప్రవీణ్ ఆదిత్య వైఖరిపై ఉద్యోగ సంఘాలు ధ్వజమెత్తాయి. రంపచోడవరం లో బుధవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీఇళ్ల వెంకటేశ్వరావు  మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో ఉద్యోగులను మానసిక వేదనకు  గురి చేస్తున్న ప్రాజెక్ట్ ఆఫీసర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సబ్ కలెక్టర్ కట్టా సింహాచలం ఐటీడీఏ పీవో దూషించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తపరిచారు .మహిళా ఉద్యోగుల పట్ల కూడా ప్రాజెక్ట్ ఆఫీసర అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఆయన విమర్శించారు .ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో జిల్లా జేఏసీ చైర్మన్ రామ్మోహన్ రావు కార్యదర్శి మూర్తి బాబు జిల్లా ఎన్జీవో సంఘ నాయకులు తిరగటి వెంకట రమణ  వెంకట కృష్ణ  ఈరంకి నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.