పీఆర్సీపై 18, 19 తేదీల్లో సమావేశం

- సీఎస్ నిర్వహిస్తారు
- బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడి

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
అక్టోబరు 13-   ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు పీఆర్సీ అమలుకు సంబంధించి నిర్ణయ తీసుకునేందుకు అక్టోబరు 18, 19 తేదీల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశం ఏర్పాటు చేయనున్నారని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జలతో తాము మాట్లాడగా వారు ఈ విషయం వెల్లడించారన్నారు. నెలాఖరులోగా పీఆర్సీ సమస్య పరిష్కారానికి నిర్ణయించినందుకు ధన్యవాదాలు తెలిపారు.ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.

- వైద్య కార్డులపైనా చర్చ జరిగింది. అవి వైద్యానికి పనికి రావడ లేదని చెప్పాం. నెట్ వర్కు ఆస్పత్రలతో మాట్లాడి సమస్య పరిష్కరించాలి లేదా బీమా అమలు చేయాలని కోరాం.
- కారుణ్య నియామకాలు 45 రోజుల్లోగా పూర్తి చేసేందుకు వీలుగా నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు హామీ ఇచ్చారు.