కలెక్టర్ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలి 

జాయింట్ కలెక్టర్ మురళి చొరవకు కృతజ్ఞతలు..

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు. కామ్)

మే 28

కరోన  విపత్కర పరిస్థితుల్లో    ప్రజల ప్రాణాలు కాపాడడంలో ఉద్యోగులకు అండగా నిలిచిన ప్రకాశం జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు వెంటనే అమలు చేయాలని  ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ జిల్లా చైర్మన్ మరియు .ఏ పీ హంస అధ్యక్షులు వినుకొండ రాజారావు విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లాలో ఉద్యోగులు కరోన బారిన పడినప్పుడు వారికి సరైన వైద్య చికిత్స లేక నగదు రహిత వైద్యానికి బెడ్స్ ఖాళీ లేవని తదితర సమస్యలు తో సతమతమౌతున్న ఉద్యోగుల సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి ముఖ్య సంఘాలు తీసుకెళ్లడం జరిగిందని వెంటనే జాయింట్ కలెక్టర్ జి వెంకట మురళి ప్రత్యేక చొరవ తీసుకుని వ్యవస్థను నడిపేది ఉద్యోగులని వారి ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించే దిశగా ప్రకాశం జిల్లా ఉద్యోగులకు వివిధ సదుపాయాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో అన్ని సదుపాయాలు కలిగిన పది ప్రత్యేక రూములు అలాగే ప్రతీ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆరు శాతం పడకలను ఈ హెచ్ ఎస్ పథకం ద్వారా భర్తీ చేయాలని  రిమ్స్ ఆసుపత్రి వెనుకభాగంలోని సోషల్ ఎంపవర్మెంట్ బిల్డింగ్ లో  ఒక ఫ్లోర్ ను ఆక్సిజన్ తో పాటు అన్ని సదుపాయాలు ఉండేలా ఏర్పాటు చేయాలని అలాగే  ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక వ్యాక్సిన్ సెంటర్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఈ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని రాజారావు విజ్ఞప్తి చేశారు.