ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ఉత్తర్వుల్లో మార్పులు

- జూన్ 30 వరకు రిటైరయ్యే వారికీ నగదు ప్రయోజనం

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)

జూన్ 13- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 2018 జులై నుంచి ఇవ్వాల్సిన కరవు భత్యం ఉత్తర్వుల్లో సవరణ చేసింది. 2021 జూన్ 30 వరకు పదవీ విరమణ చేసే వారికి కూడా నగదు ప్రయోజనం కల్పించేలా రాష్ర్ట  ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ ఉత్తర్వులు ఇచ్చారు. 2018 జులై ఒకటి నుంచి 2020 డిసెంబర్ 31 మధ్య పదవీ విరమణ చేసే వారికి నగదు చెల్లింపులకు గతంలో అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం అది 2021 జూన్ 30 వరకు కూడా పదవీ విరమణ చేసే వారికీ అవకాశం కల్పించనున్నారు. రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ర్ట అధ్యక్షులు కె.ఆర్.సూర్యనారాయణ వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.