ఆగస్టు 16లోగా ఉపాధ్యాయులందరికీ వ్యాక్సిన్

- విద్యామంత్రి సురేష్ వెల్లడి
(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జులై 29-  ఆగస్టు 16న స్కూళ్లు ప్రారంభించేలోపు ఉపాధ్యాయులందరికీ వ్యాక్సిన్ పూర్తి చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. అప్పటి లోగా వారికి బూస్టర్ డోస్ కూడా పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. విద్యాకానుక రెండో సారి అన్ని స్కూళ్లలో అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఆగస్టు 16 నుంచి కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ స్కూళ్లు తెరుస్తామని మంత్రి వెల్లడించారు.