రూ.25వేలు  వేతనం చెల్లించాలి  

*గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం డిమాండ్

 

గ్రామ వార్డు  సచివాలయఉద్యోగులకు  నెలకు రూ 25 వేల రూపాయల వేతనం చెల్లించాలని వారు కోరారు.  లేదా  ప్రొబేషనరీ  కాలంలోనే పే స్కేల్   వర్తింపచేయాలని  అన్నారు.గుంటూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో  సమావేశం జరిగింది.  సంఘం ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రజాక్ అధ్యక్షత   వహించారు.  సచివాలయ ఉద్యోగుల పరస్పర బదిలీలకుఅంతర్ జిల్లా బదిలీలకు అనుమతివ్వాలని కోరారు.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆస్కార్ రావు ముఖ్య అతిథిగా  హాజరయ్యారు.  సచివాలయ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

ఈ కార్యక్రమం లో రెవెన్యూ జేఏసీ  చైర్మన్ వాసా దివాకర్, ఏపీజీఈఏ  రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రాజు , కోశాధికారి లక్ష్మణ్ , రాష్ట్ర డ్రైవర్లు సంఘ అధ్యక్షులు శ్రీనివాస్ ,గుంటూరు జిల్లా ఏపీజీఈఏ   అధ్యక్షులు సయ్యద్ చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు.